మనతెలంగాణ/హైదరాబాద్:ఇండస్ట్రీయల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొ ల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ ల క్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తె చ్చింది పారదర్శకమైన పాలసీ అని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీ డియాతో మాట్లాడుతూ బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల కు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కా లేదన్నారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బు రద జల్లుతున్నారని ఆయన ధ్వ జమెత్తారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ఓఆర్‌ఆర్ బయటకు పంపాలన్న డిమాండ్ ఉంద ని ఆయన గుర్తుచేశారు.
ఈ పాలసీ తమ ప్రభు త్వం కొత్తగా తెచ్చింది కాదని, కెసిఆర్ ప్రభుత్వం లో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని పాలసీ మార్చేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీయల్ పాలసీ రూపకల్పనలో తాను కూడా భాగమై ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీతో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల నేతలకు వ్యతిరేకించాలన్న ఉద్దేశ్యం తప్పా ఏం లేదని ఆయన విమర్శించారు. అయి తే, నల్లగొండ డిసిసి నియామకంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని పేర్కొన్నారు.
కెసిఆర్ హయాంలో పెద్ద కుంభకోణం
తమ ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో ఎలాంటి కుంభకోణం జరగలేదన్నారు. పవర్ గ్రిడ్‌లో ల్యాండ్ స్కాం జరుగుతోందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఓ పెద్దమనిషి తాము వస్తే పాలసీ మారుస్తామని అంటున్నారని, వారు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు పాలసీ మార్చబోయేది లేదని బిఆర్‌ఎస్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో రూ.50 వేల కోట్లు కాదు, 50 వేల రూపాయల కుంభకోణం కూడా జరగలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 విభజన చట్ట ప్రకారం ఎన్టీపిసి ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో 4 వేల మెగా వాట్ల పవర్ పాంట్ ఏర్పాటు చేస్తామని అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్దమనుషులే జవాబు చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలోనే భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్వీప్‌మెంట్ ఎందుకు కొన్నదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి ప్రాజెక్టులో ఔట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని ఉత్తమ్ విమర్శించారు.