బీజింగ్: చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్‌లో టెస్ట్ రైలు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గురువారం కార్మికులు ట్రాక్‌ను తనిఖీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. లూయాంగ్‌జెన్ స్టేషన్‌లో సాధారణ నిర్వహణ పనుల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో. లిమిటెడ్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికుని… రైల్వే అధికారులు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్‌లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రైలు వ్యవస్థ ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి.