మన తెలంగాణ/హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్షంగా పని చేస్తున్న టీం భారీ సక్సెస్ సాధించిం ది. నైజీరియన్ డ్రగ్స్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాం చ్ ఆఫీసర్స్‌తో సహకారంతో రట్టు చేసింది. ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా పనిచేస్తు న్న ఈగల్ టీమ్ ఢిల్లీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా వ్యాపిం చిన నైజీరియన్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఈగల్ టీం డీకోడ్ చేసింది. ఈ జా యింట్ ఆపరేషన్‌లో భాగంగా 124 మంది ఈగల్ ఫోర్స్ (1ఎస్‌పి, 8డిఎస్పీ లు, 17ఇన్‌స్పెక్టర్స్, 16ఎస్‌ఐలు, 82 హోంగా ర్డులు/ పోలీసు కానిస్టేబుల్స్), 100 మంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్‌తో మొత్తంగా 16 టీమ్స్ తో అంతర్రాష్ట్ర దాడులు చేపట్టింది. మెహ్రౌలీ, సంత్ గర్, ప్రతాప్ ఎన్‌క్లేవ్, పృథ్వీ పార్క్, నీలోతి, చంద్ర నగర్, మునిర్కా తదితర 20 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ క్రమంలో మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా డ్రగ్స్, నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ డ్రగ్ లింక్స్‌పై ఈగల్ టీమ్ దృష్టి సారించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం 50 మంది ఓవర్ స్టే నైజీరియన్స్ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలో ఈ ఆపరేషన్ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గరల్స్, సెక్స్ వర్కర్స్ పేర్లతో ఉన్న మ్యూల్ అకౌంట్ హోల్డర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నోయిడా,గ్వాలియర్, విశాఖలో స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టామని ఈగల్ టీం అధికా రులు పేర్కొన్నారు.