ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితురాలు డాక్టర్ షాహిన్ గర్ల్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. 2023 సెప్టెంబర్‌లో అల్ ఫలా యూనివర్శిటీ సమీపం లోని మసీదులో తమ నిఖా జరిగిందని దర్యాప్తు సంస్థలకు తెలిపాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తులో ముజమ్మిల్‌కు 2023లో ఆయుధాలు కొనేందుకు షాహిన్ రూ. 6.5 లక్షలు ఇచ్చినట్టు బయటపడింది. అలాగే 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ. 3 లక్షలు ఇచ్చింది. మొత్తం ఆమె జైష్ మాడ్యూల్‌కు ఆయుధాలు, పేలుడు పదార్ధాల కొనుగోలుకు రూ.27 లక్షల నుంచి రూ. 28 లక్షల వరకు ఇచ్చినట్టు బయటపడింది. అయితే ఈ డబ్బంతా జకత్ (మతపరమైన విరాళం) కిందే ఇచ్చినట్టు దర్యాప్తు అధికారులకు షాహిన్ వెల్లడించింది.