ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన ప్రియురాలు హరిణ్యను రాహుల్ పెళ్లాడాడు. హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో రాహుల్ పెళ్లి వేడుకగా ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాహుల్, హరిణ్య జంటకు సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు తెలపుతున్నారు. ప్రస్తుతం రాహుల్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో కాలభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.