భువనేశ్వర్: చిన్నారులకు ఐస్ క్రీమ్ తినిపించి వారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కలిమెల సమితిలో ఓ గ్రామంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటుండగా పక్కింటి వారిని పిలిచి ఐస్ క్రీమ్ తినిపించాడు. అనంతరం వారిని ఇంట్లోకి తీసుకెళ్లి ముగ్గురుపై అత్యాచారం చేశాడు. అనంతరం బయటకు చెప్పొద్దని ముగ్గురిని బెదిరించాడు. పిల్లలు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.