సుమత్రా: ఇండోనేషియా దేశం సుమత్రా ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేటుపై 6.3 నమోదైందని భూపరిశోధన విభాగం ప్రకటించింది. అసెక్ ప్రావెన్స్ లో పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పొటెత్తాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.