సుమత్రా: ఇండోనేషియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమత్రా ప్రాంతంలో ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో 17 మంది మృతి చెందారు. పలు ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలలో నివిసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సుమత్రా ప్రాంతంలోని ఆరు జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నదులు ప్రమాద స్థాయిని దాటి పహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం భారీగా ఉండడంతో 2000 ఇళ్లు, భవనాలు నీటి మునిగినట్టు సమాచారం. వరదలలో కొట్టుకపోయిన వారి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.