నగరంలోని అమీర్‌పేట్‌లోని ఓ ఇంటి బాల్కనీలో గురువారం వాషింగ్ మిషన్ పేలింది. భారీ శబ్దంతో పేలడంతో వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. ఈ పేలుడు సమయంలో బాల్కానీలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయింది. వాషింగ్ మిషన్ రన్నింగ్‌లో ఉండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి తామంతా భయబ్రాంతులకు ఆ ఇంటి యజమాని తెలిపారు. తమ కుటుంబంలోని ఎవరైనా బాల్కానీలో ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. ఈ పేలుడు ధాటికి వాషింగ్ మిషన్ లోపలి భాగాలు ఎగిరిపడా ్డయని పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటన స్థానిక ప్రజానీకాన్ని ఉలికిపాటుకు గురిచేసింది.