మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిం ది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో బిసి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ బుధవారం పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్ల్లా వెల్దండ తిమ్మనోనిపల్లి వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టులో గ్రామస్థులు పటిషన్లు వేశారు. తిమ్మనోనిపల్లిలోని వార్డులన్నింటిని ఎస్సి, ఎస్టిలకే కేటాయించారని, తిమ్మనోనిపల్లిలో ఎస్సి, ఎస్టిల కంటే బిసిలు అధికంగా ఉన్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామా ల్లో సరైన రిజర్వేషన్ల పాటించడం లేదంటూ ఆంధోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచు ఆగమయ్య మరోక పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీఓ 46 తీ సుకొచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిసిలకు 117 సర్పంచు స్థానాలనే రిజర్వు చేశారని చె ప్పారు. సంగారెడ్డి జిల్లాలో బిసి రిజర్వేషన్లు 19 శాతమే ఉందని పిటిషనర్ న్యాయవాది వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేసి మళ్లీ రిజర్వు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కో ర్టును కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 17 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46కు ఈ రిజర్వేషన్లు విరుద్ధంగా ఉన్నాయని మరో పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి బుధవారం విచారణ చేపట్టారు. తదపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.