మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నగా రా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం అడిషనల్ డిజిపి మహేష్ భగవత్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన, కార్యదర్శి మకరందు తదితరులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) రాణికుముదిని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎ న్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ ర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని వెల్లడించారు. గత సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 27) నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనునున్నట్లు చెప్పారు. అలాగే రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో నోటా గుర్తు ఉంటుందని తెలిపారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్
పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రివియెన్స్ విభాగం రూపొందించినట్లు కమిషనర్ రాణికుముదిని తెలిపారు. త్వరలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఫోన్ నెంబర్ 9240021456కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు పోలింగ్
నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 27
స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29
పరిశీలన: నవంబర్ 30
నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 3
ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 11(ఉ.7 నుంచి మ. 1 వరకు)
రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డులకు పోలింగ్
నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 30
స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 2
పరిశీలన: డిసెంబర్ 3
నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 6
ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 14(ఉ.7 నుంచి మ. 1 వరకు)
రెండో విడతలో 4,150 సర్పంచ్ స్థానాలకు 36,452 వార్డులకు పోలింగ్
నామినేషన్ల స్వీకరణ: డిసెంబర్ 3
స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 5
పరిశీలన: డిసెంబర్ 6
నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 9
ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 17(ఉ.7 నుంచి మ. 1 వరకు)
మొత్తం గ్రామపంచాయతీలు : – 12,728
మొత్తం వార్డుల సంఖ్య -: 1,12,242
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య – 16,655,186
పురుష ఓటర్లు -: 81,42,231
మహిళా ఓటర్లు – : 85,12,455
ఇతరులు : 500