న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు కేవలం ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తున్నారని, రాజ్యాంగ నిర్మాణంలో వారి భాగం ఏమీ లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించడమే కాక, బ్రిటిష్ పాలనలో స్వాతంత్య్ర సమర యోధులు జైలుపాలవుతుంటే, ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారికి మద్దతుగా నిల్చిందని ఆరోపించారు. ఈరోజు అదే ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రశంసించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
1948 జనవరి 30న మహాత్మాగాంధీ హత్య తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను మొదటిసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు తాను నిషేధం విధించారని చెప్పారు. 1949 నవంబరున ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార నిర్వాహకులు రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రాచీన భారత రాజ్య అభివృద్ధి పేర్కొనలేదని, అలాగే మనుస్మృతిని ప్రస్తావించలేదని, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ గోల్‌వాల్కర్ ్త లిఖితపూర్వకంగా వ్యాఖ్యానించారని ఖర్గే విమర్శించారు.