మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పోరేషన్‌లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ద్ధమవుతోంది. శివారులోని 27 పురపాలికలను జిహెచ్‌ఎంసిలో విలీనం చేసి మహానగరంగా విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దే శంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం రూపుదిద్దుకోనున్నది. ఈ క్రమంలోనే పరిపాలనా సౌల భ్యం, మెరుగైన సేవలు అందించేందుకుగానూ గ్రేటర్ నగరాన్ని మూడు కార్పొరేషన్‌లుగా ఏర్పాటు చేయాల ని ప్రభుత్వం యుద్ద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కా ర్పొరేషన్‌లుగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగు లు వేస్తుంది. గత ఏడాది మాదాపూర్‌లోని అసోచాం ఆ ధ్వర్యంలో నిర్వహించిన ‘అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024’కు కోమటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్‌లుగా ఏర్పాటు చేయబోతున్నట్టు సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్‌ను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడం, మూడు కార్పొరేషన్‌లు చేయడం తర్వాతనే జిహెచ్‌ఎంసికి ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాల్లో టాక్ మొదలైంది.
ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపున ఉన్న మునిసిపాలిటీల విలీనం జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం ఆమోదించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన జీఓను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాతనే వెలువరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నగర పాలక సంస్థకు పాలకవర్గం ఉన్నది. ఇప్పుడు 27 మునిసిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు (జీఓ) విడుదల చేస్తే.. ప్రస్తుత మేయర్ ఓఆర్‌ఆర్ వరకు వర్తిస్తారనీ, ఇది న్యాయపరమైన అంశంగా మారుతుందనీ, జీఓ వెలువరిస్తే.. జిహెచ్‌ఎంసి పాలక సభ్యులు న్యాయపరమైన చిక్కులు తెచ్చే అవకాశాలున్నాయనీ గుర్తించిన ప్రభుత్వం.. గ్రేటర్‌లో పాలక వర్గం కాలపరిమితి ముగిసిన అనంతరమే జీఓను విడుదల చేయనున్నట్టు అధికార వర్గాల్లోని టాక్. ఈ రెండున్నర నెలలు అంటే ఫిబ్రవరి 10 వరకు విలీన ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పనులన్నీ, ఆర్థిక, భౌగోలిక, రెవెన్యూ అంవాలకు సంబంధించిన విషయాలను పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
చర్యలు..ఒకటి తర్వాత ఒకటి..
ఓఆర్‌ఆర్ లోపలి వైపున ఉన్న గ్రామపంచాయితీల పాలక వర్గాల సమయం ముగియగానే వాటిని సమీపంలోని మునిసిపాలిటీలలో విలీనం చేశారు. మునిసిపాలిటీల్లో పాలకవర్గం కాల పరిమితి పూర్తయిన తర్వాత వాటిలో స్పెషల్ ఆఫీసర్ పాలనను తీసుకొచ్చి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసి పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ పాలనలోని మునిసిపాలిటీలను కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రతిపాదనను సంస్థ సర్వసభ్య సమావేశమందు ప్రవేశపెట్టి కౌన్సిల్‌చే ఆమోదించారు. ఇక ఇప్పుడు జీహెచ్‌ఎంసి పాలక మండలి గడువు వచ్చే ఏడాది 2026, ఫిబ్రవరి 10తో ముగియనున్నది. 2026, జనవరి 26 నాటికి మూడు కార్పొరేషన్‌ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అంతర్లీనంగా పూర్తిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఓ ఐపిఎస్, మరో ఐఏఎస్ అధికారులిద్దరితో పాటు జీహెచ్‌ఎంసి అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసి మూడు కార్పోరేషన్‌ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలపై నివేదికను తెప్పించుకోనున్నట్టు అధికారుల్లోని అభిప్రాయం.
2053.44 కి.మీ.లు.. జనాభా 1,25, 00,694
ప్రస్తుతం జీహెచ్‌ఎంసి విస్తీర్ణం 650 చ.కి.మీ.లు. జనాభా 1,02,00,000. మునిసిపాలిటీలు20+ మునిసిపల్ కార్పొరేషన్‌లు7 (27 పురపాలికలు 948.16 చ.కి.మీ.లు..విలీనమైన 33 గ్రామపంచాయితీల విస్తీర్ణం386.28 చ.కి.మీ.లు కలుపుకుని) 1334.44 చ.కి.మీ.లు. జనాభా 23,00,694గా ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విస్తీర్ణం 40.17 చ.కి.మీ.లు. జనాభా 4 లక్షలు, టిఎస్‌ఐఐసి/ఐలాలు61 విస్తీర్ణం 28.95 చ.కి.మీలు మొత్తంగా ఓఆర్‌ఆర్ లోపలి విస్తరిత ప్రాంతం 2053.44 చ.కి.మీ.లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీటిలో నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం, ఐలాస్ విస్తరిత ప్రాంతం (40.17+28.95) 69.12 చ.కి.మీ.లును తొలగిస్తే.. మొత్తం జీహెచ్‌ఎంసి విస్తరిత ప్రాంతం 1984.32 కి.మీ.లుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని జనాభ 1,25,00,694లుగా ఉందని రికార్డులు పేర్కొంటున్నాయి. ఓఆర్‌ఆర్ లోపలివైపున ఉన్న 1984.32 చ.కి.మీ.ల విస్తరిత ప్రాంతాన్ని 641+642+701.32 చ. కి.మీ.లుగా హైదరాబాద్ (641చ.కి.మీ.లు), సైబరాబాద్ (642 చ.కి.మీ.లు), సికింద్రాబాద్ (701.32 చ.కి.మీ.లు) కార్పోరేషన్‌లుగా విభజించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల్లోని అభిప్రాయం.
వార్డులు..
జీహెచ్‌ఎంసిలో ప్రస్తుతం 150 వార్డులు. 20 మునిసిపాలిటీల్లోని వార్డులు 407, కార్పొరేషన్‌లు7లలోని వార్డులు 215.