వర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘పూరిసేతుపతి’ షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోను టీం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.