మన తెలంగాణ/హైదరాబాద్‌ః జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరవుతారు.