హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగీ లో భర్త అత్మహత్యాయత్నం చేశాడు. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భర్త మహ్మద్ వాజీద్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని తమ అత్త ఇంటి వారికి భార్య చెప్పింది. తలుపులు బద్దలు గొట్టి వాజీద్ ను సోదరులు కాపాడి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాజీద్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వాజీద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.