హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ మరో వైవిధ్యభరితమైన సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ‘వీర సింహారెడ్డి’ విజయం తర్వాత ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘#NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారంలో ఉంది. కాగా, బుధవారం ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా పంచుకుంది. ఈ పోస్టర్‌లో చూస్తే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆయన ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
కాగా, ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది బాలకృష్ణ.. నయనతార కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీ రామరాజ్యం’ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అంతేకాక.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో వస్తున్న ఆరో చిత్రమిది.