తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నందిని విక్రమార్కల పెద్ద కుమారుడి సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహ నిశ్చితార్ధ వేడుక ప్రగతి భవన్ లో అంగరంగ వైభంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బ్రహ్మానందం, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు.. ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, కొండా సురేఖ, పలువురు రాజకీయ నాయకులు ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరయ్యారు.