మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోబోమని ఎపి సిఎం చంద్రబాబు స్పష్టీకరించారు. కృష్ణాజలాల వాటా కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. బుధవారం అమరావతిలో జలవనరుల శాఖ అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బలమైన వాదన లు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అయితే వరద జలాల వివాదాలను సామరస్యంగా వినియో గించుకోవడానికి ఎపి సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశన చేశారు.