మన తెలంగాణ/రుద్రంగి: రాష్ట్రంలో మొట్టమొద టి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఈ ఘనత రా జన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి ద క్కింది. సర్పంచ్ స్థానానికి అధికార కాంగ్రెస్ కై వసం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రుద్రంగి మండలం, ఉమ్మడి మానాల గ్రామం, రోప్లాతండాలో సర్పంచ్‌తోపాటు 8 మంది వార్డు సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. పోటీ లేకుండా ఏకగ్రీవంగా తండావాసులు సర్పంచును ఎన్నుకోవడ మే కాదు.. గెలుపు సంబరాలు కూడా చేసుకున్నా రు. రోప్లా తండాలో సుమారు 390 మంది జనా భా ఉంటారు. అయితే నిధుల సమస్యలు లేకుం డా తండాను అభివృద్ధి చేసి చూపిస్తానని, పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జవహర్లాల్ నాయక్ తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తండావాసులు తెలిపారు. జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా ఈ తండా నిలిచింది. సర్పంచ్‌గా ఎన్నికైన జవహర్‌లాల్ నాయక్‌ను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తండావాసులు, స్థానిక పెద్దమనుషులు పాల్గొన్నారు.