వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో హిస్టారికల్ ఎపిక్ ‘ఎన్‌బికె111’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది ప్రముఖ అతిథులు హాజరయ్యారు. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది.