టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్‌కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసిసి నియమించింది. వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్‌ను ఐసిసి తన అంబాసిడర్‌గా నియమించింది.
కాగా, 2026 ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్‌కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్‌సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్‌డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఇక, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది.