మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 12,728 సర్పంచ్ స్థానాలకు 2,176 స్థానాలు బిసిలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన బిసిలకు 17.08 శాతం బిసిలకు సర్పంచ్ స్థానాలు దక్కాయి. 27.45 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకుగానూ 70 సర్పంచ్ స్థా నాలు బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో 26.77 శాతం బిసిల కు సర్పంచ్ కేటాయించారు. ఈ జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. నా రాయణపేట జిల్లాలో 272 గ్రామ పంచాయతీలకు గానూ 72 (26.47 శాతం) బిసిలకు కేటాయించగా, కరీంనగర్ జిల్లాలో 318 గ్రామ పంచాయతీల్లో బిసిలకు 84(26.41 శాతం) కేటాయించారు. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలకుగానూ 69(26.23 శాతం) బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అదిలాబాద్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బిసిలకు 5 శాతం లోపే సర్పంచ్ స్థానాలు కేటాయించగా, 10 శాతం లోపు ఉన్న జిల్లాల్లో అసిఫాబాద్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 471కి గాను బిసిలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు.