రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో ని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా నెక్కొండకు మున్సిపాలిటీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.