మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల ఇందులో హీరోయిన్. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ నిజాయతీ గల రైల్వే పోలీస్ అధికారికి, ఓ ప్రాంతాన్ని శాసించే విలన్ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశం. కామెడీతో పాటు పాటలు, డ్యాన్స్‌లు ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 28 నుంచి ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఒటిటి సంస్థ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ‘‘ఈ మాసోడు మీ ఇంటికి జాతరని తీసుకొస్తున్నాడు’ అంటూ ఆ పోస్టర్‌కి క్యాప్షన్ పెట్టింది. మరి వెండితెరపై బోల్తా పడ్డ ‘మాస్ జాతర’.. బుల్లితెరపై ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.