అఫ్గానిస్థాన్‌లో సోమవారం అర్థరాత్రి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాకిస్థాస్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. తమ దేశ:లోని పౌరల ఇళ్లను టార్గెట్ చేసిందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ దాడిపై పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి కూడా వెనుకాబోమని దేశ్ మంత్రి ఖవాజా హెచ్చరించారు.