నిఖిల్ సిద్ధార్థ హీరోగా కనిపించి చాలాకాలమే అయింది. గతేడాది అతడు హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా రిలీజైంది. కానీ, ఈ సినిమా రిలీజైన విషయం కూడా చాలామందికి తెలియదు. అంతగా ఫ్లాప్ అయింది ఈ సినిమా. ప్రస్తుతం అతడు ‘స్వయంభు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ప్రకటించి చాలా కాలం అయింది. కానీ, ఇప్పటివరకూ ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఓ ప్రత్యేకమైన వీడియోతో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక సినిమాలో సంయుక్త, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెకె సెంథిల్‌కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.