డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లాలో బస్సు లోయలో పడింది. నరేంద్ర నగర్ ప్రాంతంలో బస్సు లోయలో పడడంతో ఐదుగురు మృతి చెందగా 28 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. గుజరాత్, ఢిల్లీకి చెందిన యాత్రికులు కుంజాపురి దేవాలయానికి వెళ్తుండగా బస్సులో 70 అడుగు లోతు గల లోయలో పడింది. గాయపడిన వారిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.