కొడంగల్: కొడంగల్‌లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవితాల్లో మార్పు రావాలంటే.. పిల్లలను చదివించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్‌లో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, ఐదు వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోనే తొలి సైనిక్ స్యూల్‌ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా 16 నెలల్లోపు చేసి తీరుతామన హామీ ఇచ్చారు.
మహిళలు ఆత్మ గౌరంవగా బతికేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలకు సన్నబియ్యం పంపిణఈ చేస్తున్నానమని, మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని.. సిఎం అన్నారు. వెయ్యి ఆర్టిసి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని పేర్కొన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను ప్రోత్సాహిస్తున్నామని అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు కూడా మహిళలను యజమానులను చేశామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.