హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం దమ్మన్న శివారులో రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఎసి కారు బోల్తా పడింది. 20 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 50 మంది ఒకే వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.