ముంబయి: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మేంద్ర పూర్తిపేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్.1935 డిసెంబర్ 8న పంజాబ్ లో జన్మించారు. 300కు పైగా చిత్రాల్లో నటించారు. షోలే, ఆయీ మిలన్ కీ బేలా, ఫూల్ ఔర్ పత్తర్, జీవన్ మృత్య్, మేరా గావ్- మేరా దేశ్, రాజా జానీలో ప్యార్ కియా తో డర్నా క్యా, సీతా ఔర్ గీతాలో యాదోం కీ బారాత్, దోస్త్, చరస్, ధర్మవీర్ లో నటించారు. 1954 లో ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. 1980 లో హేమామాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా ఆరుగురు సంతానం ఉన్నారు. 2004 లో బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా గెలిచారు. యాక్షన్ కింగ్, హీమ్యాన్ గా ధర్మేందర్ కు గుర్తింపు పొందారు. షోలే, చుప్కే చుప్కే సినిమాలతో టాప్ హీరోగా రాణించారు. ధర్మేంద్ర సినీ కెరీర్ ను ‘షోలే’ చిత్రం మలుపు తిప్పింది. 2012 లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య, పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ధర్మేంద్ర ఆఖరి చిత్రం ఇక్కీస్ త్వరలో విడుదల కానుంది.