హైదరాబాద్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతితో బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత తెలిపారు. నిరంజన్ చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారని అన్నారు. నిరంజన్ రెడ్డి పై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని తనకు తాను నీళ్ల నిరంజనుడిగా పేరు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలనను తలపించారని, ఆయన మూడు నాలుగు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీస్‌ను కాల్చేస్తే కూడా ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తిరుగుతుంటే మీకేమవుతుంది..? అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చెలు లేచిపోతాయని.. తండ్రి వయస్సు అని కూడా చూడననిమండిపడ్డారు. ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయమని అన్నారు. మరోసారి తన గురించి మాట్లాడితే తాట తీస్తా కవిత హెచ్చరించారు.