గౌహతి: సొంత గడ్డపై ఎదురులేని శక్తిగా ఉన్న టీమిండియా ఇటీవల కాలంలో టెస్టుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టుకు మరోసారి అలాంటి చేదు అనుభవాన్ని చవిచూసే పరిస్థితి నెలకొంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టు చెత్త ఆటతో గడ్డు స్థితినిఎదుర్కొంటోంది.
ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలైనటీమిండియా రెండో టెస్టులోనూ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. ఏదైనఅద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకోవడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. రెండు విభాగాల్లోనూ విఫలం కావడంతో భారత్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేయగా, భారత్ 210 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.