శామీర్ పేట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షామీర్ పేటలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలరేగడంతో ఒకరు సజీవదహనమయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అందులో నుంచి బయటకు రాలేకపోయాడు. చూస్తుండగానే కారులో అతడు కాలిపోయి చనిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఇంజన్ కు విశ్రాంతి లేకుండ కారు నడపడంతోనే వాహనంలో షార్ట్ సర్య్కూట్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.