హైదరాబాద్: ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో..ఇంత కళంకమైన కుచ్చితమైన రాజకీయాల్లో రాణిస్తున్నానంటే..అది దివంగత మాజీ సిఎం ఎన్టిఆర్ చలువే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఎన్టిఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అనే పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఖమ్మంలో ఎన్టిఆర్ విగ్రహావిష్కరణలో తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1983 నుంచి నేటి వరకు ఎన్టిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని, రాముడి పాదాల దగ్గర.. పార్టీలో ఎన్టిఆర్ చేర్చుకున్నారని తెలియజేశారు. నిజాయితీ, నిబధ్ధతతో పనిచేయడం నేర్చుకున్నానని, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.