మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న డబ్బా ప్రచారం ఆపేయండి
మధ్యాహ్న భోజనం కార్మికులకు వెంటనే పెండిగ్ బిల్లులు చెల్లించాలి
మాజీ మంత్రి హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సిఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన కార్మికురాలు తమ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోను హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.