ముంబయి: బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె సినిమాల్లో నటిస్తూ ప్రేమలో పడ్డారు. ఇద్దరు కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసిన అనంతం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు ప్రేమలో పడ్డాము అనే విషయాన్ని నటుడు రణ్‌వీర్ సింగ్ గుర్తు చేశారు. రామ్‌లీల షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయ్‌పూర్‌లో ఇద్దరం ప్రేమలో పడ్డామని పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ అనేది ఎన్నో ప్రేమ కథలకు ప్రారంభంగా కనిపిస్తుందన్నారు. ఈ గ్రామం ప్రేమకథలకు, ప్రేమికులకు అదృష్టమని పేర్కొన్నారు. రామ్‌లీల సినిమా షూటింగ్ చాలా కాలం జరగడంతో మా మధ్య ప్రేమ వికసించిందని, కొన్ని రోజులు సహజీవనం చేసిన తరువాత ప్రేమ పెళ్లి చేసుకున్నామని వివరించారు. ఈ జంట 2013లో ప్రేమలో పడగా 2018లో లవ్ మ్యారేజ్ చేసుకున్నామని, గత సంవత్సరం ఈ జంటకు పాప జన్మించిందన్నారు. ఉదయ్‌పూర్ తన జీవితంలో ఎంతో అదృష్టాన్ని తీసుకొచ్చిందని, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. తన కూతురు ‘దువా’ను పరిచయం చేస్తూ ఫొటోను అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేశారు.