ముంబై: టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆదివారం జరగాల్సిన ఆమె వివాహ వేడుక ఆమె తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా పడింది. అయితే ఆమెకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారట. ఆదివారం రాత్రి వైరల్ ఇన్‌ఫెక్షన్, అసిడిటితో ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. వైద్యులు ఆయనకు తగిన వైద్యం అందించి డిశ్చారి చేసినట్లు పలాశ్ సన్నిహితులు వెల్లడించారు.
కాగా, ఆదివారం స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో స్మృతి తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా, కొద్ది రోజులుగా స్మృతి ప్రీ వెడ్డింగ్ సంబరాలు జరిగాయి. హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి.