హైదరాబాద్: ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన విడుదల చేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలు విడిచిపెడుతామన్నారు. ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాలకు లేఖ రాశారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ తెలిపింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం చేపడుతున్నామని, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని, ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు. సిసిఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చామని మావోయిస్టులు తెలిపారు.