ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్‌తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి ఒక అభిమానానికి ఉన్న శక్తి. ఉపేంద్రతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.
ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్‌లో కలుద్దాం’ అని అన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ.. ‘రామ్ లేకపోతే సినిమా లేదు. ఆయనకు ఉన్న సినిమా నాలెడ్జ్ అద్భుతం. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లైఫ్‌లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా’ అని తెలిపారు. నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రామ్, ఉపేంద్ర మధ్య ఉండే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు మహేష్ నెకస్ట్ కొరటాల శివ అవుతాడని నమ్మకంగా చెబుతున్నాను. అందరు స్టార్ ఫ్యాన్స్‌ని కలిపే సినిమా ఇది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆం ధ్రప్రదేశ్ హోంమంత్రి వి. అనిత, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సె, వివేక్, మర్విన్ తదితరులు పాల్గొన్నారు.