గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు సఫారీలు 114 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 323 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సెనురన్ ముతుసామీ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఆరో వికెట్ పై ముత్తుసామీ, వెరెన్నె 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామీ(62), కైల్ వెరెన్నె(39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి సౌతాఫ్రికా ముందంజలో ఉంది.