న్యూఢిల్లీ : ‘సింధ్ ప్రాంతం ప్రస్తుతం భారతదేశంలో ఉండకపోవచ్చు, కానీ భారత్‌లో దాని సరిహద్దులు మారవచ్చు. ఆ ప్రాంతం భారతదేశంలోకి తిరిగి రావచ్చు’ అని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారంనాడు ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింధు నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ 1947 లో విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లింది. ఆ ప్రాంతంలో నివసించిన సింధీ ప్రజలు భారతదేశానికి వచ్చారు.కానీ, మానసికంగా దూరం కాలేదన్నారాయన. సింధ్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడాన్ని సింధీ హిందువులు, ముఖ్యంగా ఎల్ కె. అద్వానీ వంటి నాయకుల తరం వారు ఎన్నడూ అంగీకరించలేదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.