గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా 400+ మార్కును దాటేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సెనురన్ ముత్తుస్వామి సెంచరీ సాధించాడు. 192 బంతుల్లో అతడు మూడంకెల స్కోర్ దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడిని ఇదే తొలి శతకం కావడం విశేషం ఈ క్రమంలో ఏడు లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ చేసిన మూడో సౌతాఫ్రికా ఆటగాడిగా ముత్తుస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో క్వింటన్ డికాక్ (111), లాన్స్ క్లూజ్నర్ (102) ఈ రికార్డును సాధించారు. ఇక మరో సౌతాఫ్రికా టెయిలెండర్ మార్కో జెన్సన్ కూడా అర్థ శతకం సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. క్రీజ్‌లో ముత్తుస్వామి 106, జెన్సన్ 50 ఉన్నారు.