చెన్నై: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేది మా లక్ష్యమని నటుడు, టివికె అధినేత విజయ్ తెలిపారు. రెండు నెలల తర్వాత విజయ్ ప్రజల్లోకి వచ్చాడు. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ప్రజలతో విజయ్ ముఖాముఖి మాట్లాడారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా పోలీసుల ఆంక్షలు విధించారు. రెండు వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే ఆడిటోరియంలోకి ప్రవేశం కల్పించారు. టివికె పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని విజయ్ స్పష్టం చేశారు. వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.