హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ఎన్24 పేరుతో మూవీ టైటిల్ ను విడుదల చేశారు. నాగ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ‘వృషకర్మ’ సినిమా పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో హీరో మహేష్ బాబు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు పోస్టు చేయడంతో అక్కినేని అభిమానుల సంతోషానికి అవధులులేకుండా పోయాయి.