అమరావతిః సత్యసాయి ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చి దాని కోసమే జీవించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్షం కోసం సత్యసాయి అవతరించారని అన్నారు. పుట్టపర్తి లోని హిల్‌వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సత్యసాయిబాబా మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని, సత్యసాయిబాబా తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలియజేశారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయిబాబా చెప్పారని, మానవ రూపంలో మనం చూసినదైవస్వరూపం శ్రీ సత్యసాయి అని కొనియాడారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారని,1960లో బాబాస్థాపించిన శ్రీసత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చిందని అన్నారు. తన మహిమలతో అన్ని మతాలతో అన్ని మతాలు ఒక్కటేనని, భక్తులకు ప్రత్యక్షంగా నిరూపంచారని చంద్రబాబు పేర్కొన్నారు.
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, సత్యసాయి సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా కోట్లమంది జీవితాలను ప్రభావితం చేశారని, సకలజనుల సంక్షేమాన్ని సత్యసాయి కోరుకున్నారనిచంద్రబాబు స్పష్టం చేశారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని, సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని అన్నారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చునని సత్యసాయిబాబా నిరూపించారని, సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చిందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుందాం.