న్యూఢిల్లీ: మనదేశంలో కార్మిక రంగంలో అతి పెద్ద సంస్కరణలకు కేంద్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాలుగు కార్మిక కోడ్‌లను అమలులోకి తె చ్చింది. కొత్త గా అమలులోకి తెచ్చిన కోడ్ లు – వేతనాల కోడ్(2019) పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020) సామాజిక భద్రత కోడ్ (2020) వృత్తి పరమైన భద్రత, ఆ రోగ్యం, పని పరిస్థితుల కోడ్ (ఓఎస్ హెచ్ డబ్లుసి) కోడ్ 2020. ఈ కోడ్ ల తో ఇప్పటికే అమలులో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను రదుచేయడమో, హేతుబద్దీకరించడమో జరుగుతుంది. కొత్త కొడ్‌లు ఓ చారిత్రాత్మక నిర్ణయం అని కేంద్రప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక నియమాలను సులభతరం చేస్తుందని, కార్మిక సంక్షేమాన్ని పెంచడంతో పాటు, భద్రతా ప్రమాణాల ను బలోపేతం చేస్తుందని పేర్కొంది. 2025 నవంబర్ 21నుండి అ మలులోకి వచ్చిన ఈ కోడ్ ల వల్ల భారతదేశ కార్మికవ్యవస్థ ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతులకు దీటుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కోడ్ ల లక్ష్యం భవిష్యత్ లో అవసరాలకు అనుగుణమైన రక్షితమైన శ్రామిక శక్తిని కల్పించడమేనని పేర్కొంది. ఈ విప్లవాత్మక మార్పు ఉపాధి కల్పనకు తోడ్పడమే కాక, ఆత్మనిర్భర్ భారత్ అమలుకు సంబంధించిన కార్మిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని ప్రభుత్వం పేర్కొంది.
నాలుగు కొత్త కోడ్ ల అమలు వల్ల కలిగే ప్రయోజనాలు
1. నియామకాలలో పారదర్శకత కోసం, ప్రతి కార్మికుడికీ నియామక పత్రం జారీ తప్పనిసరి.
2. సార్వత్రిక సామాజిక భద్రతా కవరేజ్ కింద గిగ్ , ప్లాట్ ఫామ్ కార్మికులతో సహా అందరికీ, పెన్షన్ ఫండ్, ఈఎస్ ఐ సి, బీమా, ఇతర ప్రయోజనాలు.
3. కార్మికులు అందరికీ కనీస వేతనాలకు చట్టబద్ధమైన హక్కు.
4. కార్మికులలో 40 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా ప్రతిఏటా ఆరోగ్య పరీక్షలు, రోగ నివారణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రోత్సాహకాలు
5. వేతనాలను సకాలంలో చెల్లించడం తప్పని సరి చేయడం.వివక్షణ తొలగింపు
6. మైనింగ్, ప్రమాదకర పరిశ్రమలతో సహా అన్ని రంగాలలో మహిళల భద్రతా చర్యలు
వారి అంగీకారంతోనే రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అనుమతి.
7. చిన్న పరిశ్రమలు, ప్రమాదకరమైన సంస్థలతో సహా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో ఈఎస్‌ఐసి కవరేజ్.
8. సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ తో సహా చాలా భారాలను తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు
కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారు. రంగాలవారీగా ఈ నాలుగు కోడ్ లు భారతదేశంలో సమగ్ర కార్మిక రక్షణకు అద్దంపడతాయి. భారతదేశంలో సామాజిక భద్రత పెరగడంతో 2015లో 19 శాతం ఉన్న శ్రామిక శక్తి, 2025లో 64 శాతం కన్నా పెరిగింది.
నాలుగు కోడ్ లు ప్రగతిశీల కార్మిక పరమైన సంస్కరణలు – ప్రధాని
స్వాతంత్రం తర్వాత అత్యంత ప్రగతిశీల సంస్కరణలకు ఈ నాలుగు కార్మిక కోడ్ లు సంకేతాలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కార్మికుల సాధికారత కల్పనలో ఇవి తోడ్పడతాయని ఆయన అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహింస్తుందని ఎక్స్ వేదికగా శుక్రవారం నాడు ప్రధాని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల మరిన్ని ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఉత్పాదకత పెరిగి, వికసిత భారత్ వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.