మన తెలంగాణ/హైదరాబాద్:అనర్హత వేటుకు ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చే సేందుకు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడి యం శ్రీహరి సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాల విశ్వసనీయవర్గాల సమాచారం. బిఆర్‌ఎస్ నుం చి ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని 10 మంది ఆరోపణలు ఎ దుర్కొంటున్న విషయం తెలిసింది. వీరిలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీక ర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇదివరకే విచారణ జరిపారు. కాగా, మరో ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి నెల రోజుల క్రితమే తమకు సమాధానం చెప్పేందుకు గడువు కావాల ని కోరారు. ఈ నేఫథ్యంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ ఎంఎల్‌ఏల విచారణను వేగవంతం చేయడమే కాకుండా తాజాగా మిగతా ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా మరోసారి నోటీసు పంపించా రు. ఈ నెల 23 వ తేదీలోగా కౌంటర్ దాఖలు చే యాల్సిందిగా స్పీకర్ తన నోటీసులో పేర్కొన్నా రు. ఈ నేపథ్యంలోనే ఎటూ తేల్చుకోలేక డైలమాలో ఉన్న కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి తనకు మరి కొంత గ డువు కావాలని కోరారు.
నాలుగు వారాల్లో తా ను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబ ట్టి తాను ఎక్కువగా సమయం ఇవ్వలేనని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయనతో చెప్పినట్లు తెలిసింది. దీంతో కడియం శ్రీహరి ఈ నెల 27న రాజీనా మా చేస్తారన్న ఊహగానాలు నెలకొన్నాయి. కా గా దానం నాగేందర్ ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్‌ను కలిసి గడువు కోరకుండా రాజీనామా చేస్తారన్న ప్రచారంకూడా జరుగుతున్నది. ఇదిలాఉండగా ఫిరాయింపు ఎంఎల్‌ఏలు దానం నాగేంద ర్, కడియం శ్రీహరి ,దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నది. వారిరువురితో రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించి గెలిపించుకుంటే మంచిదన్న భావనతో ఉంది. వారితో రాజీనామా చేయించకపోతే స్పీకర్‌కు గత్యంతరం లేక వారిపై అనర్హత వేటు వేస్తే, రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం వారు వచ్చే ఆరేళ్ళ వరకూ చట్ట సభలకు పోటీ చేయకుండా అనర్హులవుతారు. కాబట్టి ముందుగానే రాజీనామ చేయించినట్లయితే ఫిరాయింపుల నిరోధక చట్టం వేటు నుంచి తప్పించుకోవచ్చన్న ఆరోచన చేస్తున్నట్లు సమాచారం.
రాజీనామాకు దానం సిద్దం&
శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంఎల్‌ఏ దానం నాగేందర్ ఘంటాపథంగా చెబుతున్నారు. తాను సునాయసంగా విజయం సాధిస్తానన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పవచ్చు. జూబ్లీ ఉత్సాహంతోనే ఖైరతాబాద్‌లో ఘన విజయం సాధించవచ్చన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
దానంకు పొంచి ఉన్న ప్రమాదం
కాగా దానం నాగేందర్ రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. బిఆర్‌ఎస్ నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైన దానం ఆరు నెలల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం బహిరంగ రహస్యమే. ఇంత స్పష్టమైన ఆధారం ఉంది కాబట్టి అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని పార్టీ నాయకులూ ఆందోళనలో ఉన్నారు.
కడియంపై సందిగ్ధత..
మరోవైపు కడియం శ్రీహరి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే తిరిగి పోటీ చేయించే విషయంలో సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం, ఎంఎల్‌ఏగా తనకు ఇదే చివరి ఎన్నికలని పలు పర్యాయాలు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కడియం తిరిగి పోటీ చేసినా గెలుపొందుతారా? అనే సందేహాలూ నేతలకు లేకపోలేదు. కడియం శ్రీహరి కుమార్తె లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నందున, ఇంకా ఆయన్ను గెలిపించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కడియం రాజీనామా చేసినట్లయితే స్టేషన్ ఘన్‌పూర్ స్థానాన్ని చురుకైన నాయకురాలు ఇందిరకు దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి రాజీనామా చేయడమే ఉత్తమేనన్న భావనతో పార్టీ నాయకత్వం ఉంది.
కోల్‌కత్తా హైకోర్టు కీలక తీర్పు..
ఇదిలాఉండగా ఇటీవల కోల్‌కత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి తరపున పోటీ చేసి ఎంఎల్‌ఏగా గెలుపొందిన ముకుల్ రాయ్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బిజెపి నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ముకుల్ రాయ్ శాసనసభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.