అమరావతి: ప్రియురాలితో ఏడబాటు తట్టుకోలేక ప్రియుడు భార్య ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపినాపి గ్రామంలో కోటపాటి విష్ణువర్ధన్, సరిత అనే దంపతులు కలిసి ఉంటున్నారు. ఈ దంపతులకు కూతురు కూడా ఉంది. ఇటుకబట్టీలో పని చేస్తుండగా విష్ణువర్ధన్‌కు ధనలక్ష్మి అనే మహిళ పరిచయం కావడంతో వివాహేతర సంబందానికి దారితీసింది. ఈ విషయం భార్యకు తెలియడంతో పలుమార్లు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె తన అత్తమామల దగ్గరే ఉంటుంది. దీంతో విష్ణువర్థన్ తన ప్రియురాలు ధనలక్ష్మితో కలిసి ఇంటికి వచ్చాడు. దీంతో సరిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వేరుగా ఉండాలని సూచించారు. కానీ తనకు ప్రియురాలు కావాలని ఆస్తి వద్దని భార్య పేరు మీద రాశాడు. అదే సమయంలో ప్రియురాలు బంధువులు అక్కడికి వచ్చి ధనలక్ష్మిని తీసుకెళ్లారు. దీంతో ప్రియుడు విష్ణు దుకాణంలోకి వెళ్లి పురుగుల మందు డబ్బాను కొనుగోలు చేశాడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై తాగి కిందపడిపోయాడు. భార్య, బంధువులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.