అమరావతి: విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. పుట్టపర్తిలో సాయి కులంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దర్శించుకున్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. సత్యసాయిబాబ బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని, సత్యసాయి సదేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారని రాష్ట్రపతి ప్రశంసించారు. సత్యసాయి ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు.
అంతకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగించుకొని పుట్టపర్తికి చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డిజిపి శివధర్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.